ఐలవరం(భట్టిప్రోలు): జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాపట్లలో జనవరి తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో వి.హరికృష్ణ, ఎం.రోహిత్ నాగసాయి మణికంఠ, పి.విజయ్‌కుమార్‌రెడ్డి, సీహెచ్ డోలా పూర్ణచంద్ దినేష్ విశేష ప్రతిభ కనబరచి శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు మార్టూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యరు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న నలుగురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి, హైస్కూల్ హెచ్‌ఎం ఎం. మోహన్‌రావు, ప్రస్తుత ఇన్‌చార్జి హెచ్‌ఎం చిలుకోటి తాండవకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ బాబు, గ్రామ మాజీ సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.


