వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి రూరల్‌ పరిధిలోని చినకాకాని హాయ్‌లాండ్‌ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళగిరి రూరల్‌ పోలీసులకు స్థానికులు గురువారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిని రూరల్‌ ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్‌ మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి వివరాలు లభించలేదు. బహుశా వడదెబ్బవల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్‌ కలర్‌, నలుపురంగు గీతలు కలిగిన ప్యాంటు, తెలుపు, ఆకుపచ్చ గళ్ల చొక్క, గెడ్డం ఉన్నాయని, మృతుడి వయస్సు సుమారు 30–35 ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే మంగళగిరి రూరల్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement