పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026 సర్‌దిద్దేందుకు సన్నాహాలు నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం ● జిల్లాలో జూన్‌ 5వ తేదీ నుంచి సర్‌ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. ● జూలై 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు వివరాలను పరిశీలిస్తారు. ● జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకు సర్‌ సర్వేలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అంతేగాక ఎన్యుమరేషన్‌ ఫారంలను ముద్రిస్తారు. ● జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్తారు. ఎన్నురేషన్‌ ఫారం–2ను ఇచ్చి, పూరించుకొని తిరిగి తీసుకుంటారు. ఇదే సమయంలో పోలింగ్‌ కేంద్రాల పునర్‌ వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది. ● జూలై 21న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. అదే రోజు నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ● జూలై 21 నుంచి సెప్టెంబర్‌ 18వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతారు. ● తుది ఓటరు జాబితాను సెప్టెంబర్‌ 22వ తేదీన ప్రకటిస్తారు.

న్యూస్‌రీల్‌

మర్యాదపూర్వక కలయిక

జిల్లాలో జూన్‌ 5 నుంచి కార్యక్రమం ఓటర్ల జాబితా సవరణకు ప్రణాళికలు ప్రతి ఓటరూ ఎన్యుమరేషన్‌ ఫారం–2 ఇవ్వాల్సిందే ఇవ్వకుంటే జాబితా నుంచి పేరు తొలగింపు జూన్‌ 15 నుంచి ఇంటింటికీ బీఎల్‌వోలు సెప్టెంబర్‌ 22న తుది జాబితా ప్రచురణ జిల్లాలో 17,41,512 మంది ఓటర్లు

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026
సర్‌దిద్దేందుకు సన్నాహాలు
జాతీయ ఎన్నికల కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలో ఓటరు జాబితా పక్కాగా రూపొందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఓటరు జాబితా ప్రకారం బీఎల్‌వోలు వారి పరిధిలోని ఓటర్ల ఇంటింటికీ వెళ్లి నేరుగా పరిశీలన చేయనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనికి సంబంధించి నిర్దేశిత కార్యక్రమాలను అధికారులు రూపొందించారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,200, మోడల్‌ ధర రూ.3,000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

సత్తెనపల్లి: జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని బూత్‌ లెవెల్‌ పోలింగ్‌ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్‌ 5వ తేదీ నుంచి ఓటరు జాబితాలోని ప్రతి ఓటరును కలిసేందుకు సన్నద్ధం అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 17,41,512 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఎవరికి వారు తాము ఓటర్లుగా ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోలేని వారి పేరును జాబితా నుంచి తొలగిస్తారు.

ఎలా రుజువు చేసుకోవాలి...?

ఎన్నికల సంఘం ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్‌ ఫారంలను ఇస్తుంది. వాటిని పూరించి ఎన్నికల సంఘానికి ఒకటి ఇచ్చి, రెండోది ఓటరు వద్దే ఉంచుకోవాలి. ఎన్నికల అధికారులకు ఫారం ఇవ్వకపోతే పేరు జాబితా నుంచి తొలగిస్తారు. గతంలో ఓటరు తన గుర్తింపు కోసం ఆధార్‌, ఓటరు కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ ఫొటో తదితరాలను ఇచ్చేవారు. సర్‌లో ఎన్యుమరేషన్‌ ఫారం – 2 ఇవ్వడమే ప్రత్యేకం. తద్వారా మృతుల పేర్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది. వలస వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించనున్నారు. ఒక వ్యక్తి పేరు రెండు చోట్ల ఉంటే కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అక్రమ మార్గాల ద్వారా ఓటరుగా నమోదై ఉంటే ఈ ప్రక్రియతో తొలగించడం సులభం అవుతుందని, ప్రతి ఓటరూ దీనికి సహకరించాలని ఎన్నికల సంఘం కోరింది.

షెడ్యూల్‌ ఇదే...

7

జిల్లాలో నియోజకవర్గాలవారీగా ఓటర్ల్ల వివరాలు

నియోజకవర్గం ఓటర్ల సంఖ్య

నరసరావుపేట 2,33,723

చిలకలూరిపేట 2,26,910

సత్తెనపల్లి 2,42,991

పెదకూరపాడు 2,34,049

వినుకొండ 2,65,990

గురజాల 2,75,061

మాచర్ల 2,62,788

మొత్తం 17,41,512

Advertisement
 
Advertisement
Advertisement