పరారైన ఖైదీ కోసం ముమ్మర గాలింపు | - | Sakshi
Sakshi News home page

పరారైన ఖైదీ కోసం ముమ్మర గాలింపు

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

పరారైన ఖైదీ కోసం ముమ్మర గాలింపు

సత్తెనపల్లి: సత్తెనపల్లి సబ్‌జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ పరారైన తమ్మినేని శ్రీనివాసరావు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. ఖైదీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించవచ్చన్నారు. ఎక్కడ కనిపించినా వెంటనే 94407 96230 ఫోను నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గుంటూరు అరండల్‌పేట్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement