త్రిచక్రవాహనం అదుపుతప్పి దివ్యాంగుడు మృతి | - | Sakshi
Sakshi News home page

త్రిచక్రవాహనం అదుపుతప్పి దివ్యాంగుడు మృతి

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

త్రిచక్రవాహనం అదుపుతప్పి దివ్యాంగుడు మృతి

చిలకలూరిపేటటౌన్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన సయ్యద్‌ దరియా హుస్సేన్‌(56) దివ్యాంగుడు. ఈనెల 23వ తేదీన మూడు చక్రాల స్కూటీపై కూరగాయల నిమిత్తం చిలకలూరిపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు స్కూటీ అదుపుతప్పింది. దీంతో స్కూటీపై నుంచి కిందపడిన హుస్సేన్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించగా, గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు సయ్యద్‌ బుడే ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement