సబ్సిడీ దాణాను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ దాణాను సద్వినియోగం చేసుకోవాలి

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

సబ్సిడీ దాణాను సద్వినియోగం చేసుకోవాలి వృద్ధురాలిపై లైంగిక దాడి వేమూరు: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. వేమూరు మండలంలోని చావలి గ్రామానికి చెందిన వృద్ధురాలు(80) పూరిల్లులో ఉంటోంది. వేసవి కావడంతో మంచం ఇంటి ముందు వేసుకొని నిద్రిస్తోంది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 8 గంటలకు, అదే గ్రామంలోని దళితవాడకు చెందిన చావలి ఆనందబాబు(40) డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు లేవని చెప్పడంతో నోటిలో గుడ్డలు పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. రెండు వాహనాలు ఢీ.. మహిళ మృతి జిల్లాలో డ్రాపవుట్లు ఉండరాదు

జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి

డాక్టర్‌ వేణుగోపాల్‌

బాపట్లటౌన్‌: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణా, గడ్డి విత్తనాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. మండలంలోని ఈతేరు గ్రామంలో బుధవారం పశుపోషకులకు సబ్సిడీపై అందిస్తున్న దాణా, గడ్డివిత్తనాలను పంపిణీ చేశారు. డాక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఈతేరు గ్రామంలో 4 టన్నుల దాణా, 3 క్వింటాళ్ళ జొన్న విత్తనాలను అందజేశామన్నారు. బాపట్ల సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, పశు వైద్యాధికారిణి రేచెల్‌ దివ్య, స్పెషల్‌ ఆఫీసర్‌ శారద, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పర్చూరు(చినగంజాం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పర్చూరు ఎస్‌ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. కారంచేడు నుంచి పర్చూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న తల్లీ కుమారుడు షేక్‌ నజీర్‌(36), షేక్‌ మీరాబీ (55)లను మంగళగిరి నుంచి చీరాల వైపు వెళుతున్న కారు ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మీరాబీ అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనం నడుపుతున్న నజీర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ గోపి.. గాయాలపాలైన అతన్ని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

జిల్లా విద్యాశాధికారి పీవీజే రామారావు

పిడుగురాళ్ల: జిల్లాల్లో ఒక డ్రాప్‌ అవుట్‌ కూడా లేకుండా చూడాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోనే డ్రాపవట్లు లేని జిల్లాగా పల్నాడును నిలబెట్టాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌లు, సచివాయాల్లో డేటా తీసుకొని ప్రతి మండలాన్ని జల్లడి పట్టి డ్రాప్‌ అవుట్‌లు లేకుండా చూడాలని తెలిపారు. దీనిలో భాగంగానే బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement