కారంచేడు: ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఇండియన్ మోడల్ హంట్ విజేతగా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన కే దివ్యశ్రీ ఎంపికవ్వడం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుగ్రామమైన కుంకలమర్రులో వ్యవసాయ కుటుంబానికి చెందిన దివ్యశ్రీ చిన్నతనం నుంచే ఫ్యాషన్ షోలు, మోడలింగ్‌లపై మక్కువ ఉండేది.
ఈ క్రమంలో చదువులతోపాటు మోడలింగ్‌లోను రాణిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టీవీ సిరియల్ ఆర్టిస్ట్‌గాను ఆమె రాణిస్తున్నారు. ఈ క్రమంలో మోడలింగ్ ఆకాడమీ డైరెక్టర్ సతీష్ అడ్డాల, దీక్షల ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జరిగిన ఇండియన్ మోడల్ హంట్ సీజన్–4లో పాల్గొన్న దివ్యశ్రీ తన ప్రతిభ కనబరిచి ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించారు.
దేశవ్యాప్తంగా వందల మంది పాల్గొనగా ఫైనల్‌కు కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. వారిలో తనను ఎంపిక చేసిన డైరెక్టర్ సతీస్ అడ్డాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దివ్యశ్రీ తల్లిదండ్రులైన కనపర్తి రాములు, జ్యోతి, గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


