పింఛన్ల పంపిణీలో ఆదర్శంగా నిలుద్దాం | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో ఆదర్శంగా నిలుద్దాం

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

నరసరావుపేట: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పల్నాడును మార్చేందుకు అధికారులంతా కృషిచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో సమావేశం ద్వారా మండల పరిషత్‌ అభివృద్ధి, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి నెల జిల్లాలో రూ.118 కోట్లు పింఛను రూపంలో లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది తప్పనిసరిగా ప్రతినెల ఒకటో తేదీనే పింఛనుదారుకు ఇంటి వద్దే పింఛను అందించాలన్నారు. లబ్ధిదారులతో సత్‌ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈవిషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పింఛన్‌ దారుల ఫోన్‌ నెంబర్లు మ్యాపింగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పింఛను తీసుకున్న వారికే ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ వెళ్తున్నది, లేనిదీ నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, డీజీఎస్‌డబ్ల్యూఎస్‌ సీఈఓ స్లీవారెడ్డి, డీఎల్‌డీఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ

Advertisement
 
Advertisement
Advertisement