న్యూస్‌రీల్
ఎరువుల పాత, కొత్త ధరలు (రూ.లలో)
నేటి సర్కారు అన్నింటా విఫలం...
సాగర్ నీటిమట్టం
ఆలయ నిర్మాణానికి విరాళం
పులిచింతల సమాచారం
పల్నాడు
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026
నేడు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు
● 50 కిలోల బస్తాపై
రూ. 75 – రూ. 350 వరకు పెంపు
● చంద్రబాబు పాలనలో ఇప్పటికే
మూడుసార్లు పెరుగుదల
● జిల్లాలో గతేడాది సాధారణ సాగు
విస్తీర్ణం 1,55,607 హెక్టార్లు
● ఖర్చుల భారంతో సాగుకు వెనుకడుగు
వేస్తున్న అన్నదాతలు
సత్తెనపల్లి: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350 వరకు పెరగడం రైతుల్లో కలవరం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం డీఏపీ, యూరియా ధరలను నియంత్రిస్తూ రాయితీని భరిస్తోంది. భాస్వరం, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. ఎరువుల ధరల పెంపుతో రైతులపై రూ.కోట్ల భారం పడుతోంది. ఈ క్రమంలో ఏటా పెట్టుబడుల వ్యయం పెరిగిపోతుండడం.. చేతికి వచ్చిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలు పెరుగుదల రైతుల నెత్తిన పెనుభారం మోపి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ రెండేళ్ల కాలంలోనే మూడుసార్లు ఎరువుల ధరలు పెరగడం గమనార్హం.
జిల్లాలో గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 1,55,607 హెక్టార్లుగా ఉంది. పంటలు సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్‌ఫాస్పేట్ ఎరువుల వాడకంతోపాటు పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఫలితంగా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో టన్ను పై రూ.వెయ్యి నుంచి రూ. 4 వేల వరకు ఎరువుల ధరలు పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే సన్న, చిన్నకారు రైతులు ఎరువుల దుకాణాల వద్ద అప్పులు పెడుతున్నారు. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత అసలు, వడ్డీతో అప్పు తీర్చవలసి రావడంతో ఆదాయం ఎరువుల దుకాణాల వద్దే సరిపోతోందని వాపోతున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో పెట్టుబడి సాయం అందించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులను ఆదుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట కాలంలోనే నష్టపరిహారం అందించేవారు. ఇవే కాకుండా ఎరువులు, విత్తనాలు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచేవారు. గిట్టుబాటు ధరలు కూడా అందించడంతో రైతులు లాభపడ్డారు.
ఎరువులు పాత ధర కొత్త ధర పెంపు
పొటాష్ 1,850 1,975 125
సూపర్ ఫాస్ఫేట్ 615 775 160
16–20–13 1,400 1,750 350
20–20–13 1,450 1,800 350
10–26–26 1,950 2,025 75
12–32–16 1,850 1,950 100
16–16–16 1,675 1,950 275
14–35–14 2,150 2,350 200
7
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అసాధారణంగా వీస్తున్న తీవ్రమైన వడగాడ్పులు, రికార్డు స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. కావున సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరూ బయట తిరగవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిరంతరం మంచినీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకుంటూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని, వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలని కోరారు.
2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత రెండేళ్ల పాలనలో తాము పడేపాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. వ్యవసాయాన్ని ఆదుకొనే పనులు చేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రం నుంచి ఎరువుల కోటాను రప్పించుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. ఎరువుల కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.80 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి సూరాబత్తిన సీతారామయ్య దంపతులు ఆదివారం రూ.1,11,116 విరాళంగా అందజేశారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,2126 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం .. వారికి అన్ని విధాలా నిత్యం అండగా ఉంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మాటలు అబద్ధమని తేలిపోయింది. పైగా వారిపై ఏటా అదనపు ఆర్థిక భారం మోపుతోంది. సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది. ఒకవైపు పంటలకు మద్దతు ధరలు లేవు... మరోవైపు పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయి. ఇప్పుడు ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.


