పిడుగురాళ్ల: గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో పిడుగురాళ్ల ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా నిప్పుల కొలిమిలా మారి తీవ్ర ఆందోళన చెందే సమయంలో అకస్మాత్తుగా ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. సుమారు 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. వర్షంతోపాటు చిన్న చిన్న వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులు వీయటంతో వాతావరణం అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారింది. సాయంత్రం 3 గంటల వరకు ఎండ భారీగా పెరిగి ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదు అయింది. అనంతరం ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణ ప్రజలు కాస్త సేదతీరారు. ఈదురు గాలుల దెబ్బకు పట్టణంలో విద్యుత్తు సరఫరా ఆపివేశారు. మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత రాత్రికి సరఫరా పునరుద్ధరించారు.


