మాచర్ల: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబుతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. మాచర్లలోని పీఆర్కే గృహానికి గురువారం చేరుకున్న అన్నా రాంబాబు.. ఆయన్ను పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాభిమానం కలిగిన పీఆర్కే లాంటి వ్యక్తులను ఎన్నుకుని, వారిని అక్రమ కేసుల్లో ఇరికించటం పనిగా పెట్టుకున్నారన్నారు. పీఆర్కేపై అక్రమ కేసులు నమోదు చేయటమే కాకుండా సాక్ష్యాధారాలతో సంబంధం లేకుండా జైలుకు పంపడం దారుణమన్నారు. పలువురు నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు.


