స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి శకటాల తయారీ ప్రక్రియను తనిఖీ చేసిన సంచాలకులు

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

సత్తెనపల్లి: స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే కన్నా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయలు ప్రమా ద బీమా కల్పిస్తుందన్నారు. పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ డబ్బాల నివారణకు స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యంతో కట్టడి చేయాలన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో జీవీ రమణాకాంతరెడ్డి, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ బి.మధుసూదనరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎం.విజయసారధి, మున్సిపల్‌, రెవెన్యూ, ఐసీడీఎస్‌ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

లక్ష్మీపురం: రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలలో వివిధ శాఖలు ప్రదర్శించనున్న శకటాల తయారీ ప్రక్రియను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్‌.విశ్వనాథన్‌ శనివారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శాఖలు తమ శకటాల రూపకల్పన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement