నిరసన గళం
దోపిడీ తప్ప అభివృద్ధి లేదు
లంచాల కోసం అమ్మకం
స్వచ్ఛందంగా పాల్గొన్నారు
ప్రభుత్వ తీరు చాలా బాధాకరం
పల్నాడు నుంచి కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి తరలింపు
● జెండా ఊపి వాహనాలను
ప్రారంభించిన జిల్లా నేతలు
● పార్టీ జిల్లా కార్యాలయం నుంచి
నరసరావుపేట శివారు
వరకు భారీ ర్యాలీ
● పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్ సీపీ
నేతలు, కార్యకర్తలు, ప్రజలు
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా నినాదాలు
● చంద్రబాబు ప్రభుత్వ
విధానాలను తప్పుపట్టిన నేతలు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 37వేల సంతకాలు సేకరించి తాడేపల్లి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తున్నాం. రాజకీయాలకతీతంగా టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్త లు కోటి సంతకాల ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటి మంది మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలుచేయడం విశేషం. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కూటమి పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్...కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్.
–డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేటరూరల్:
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 4.37 లక్షల సంతకాలు సేకరించారు. ఆ పత్రాలను జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి సోమవారం తరలించారు. జిల్లా నేతలు జెండా ఊపి సంతకాల పత్రాలు ఉన్న వాహనాన్ని ప్రారంభించారు. లింగంగుంట్లలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి నరసరావుపేట శివారులోని ఎస్‌ఆర్‌కేటీ జంక్షన్ వరకు కార్లు, బైక్‌ల ర్యాలీ సాగింది. లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి, పాత పోస్టాఫీస్, పల్నాడు చెక్‌పోస్ట్, పల్నాడు బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ర్యాలీగా సాగింది. నేతలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, మాట్లాడారు. అనంతరం మల్లమ్మ సెంటర్, చిలకలూరిపేట ప్లైఓవర్ మీదుగా ఎస్‌ఆర్‌కేటీ జంక్షన్‌లో బత్తిన గార్డెన్స్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో ముఖ్యంగా యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, గజ్జెల సుధీర్ భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎనుమల మురళీధర్‌రెడ్డి, పడాల శివారెడ్డి, గుత్తికొండ అంజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్, సీనియర్ నాయకులు కేవీ, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, రోళ్ల మాధవి, పీఎస్ ఖాన్, గంటెనపాటి గాబ్రియేలు, కె.బ్రహ్మారెడ్డి, పాలపర్తి వెంకటేశ్వరరావు, పడాల చక్రారెడ్డి, కొమ్ము చంద్రశేఖర్, డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, మనీంద్రరెడ్డి, అన్నెం పున్నారెడ్డి, అన్నా మోహన్, హెల్డా ప్లారెన్స్, బొగ్గరం మూర్తి, రమావత్ జాన్‌పాల్‌నాయక్, బి.శ్రీలక్ష్మి, పొన్నపాటి విజయకష్ణారెడ్డి పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన కోటి సంతకాల సేకరణ పిలుపులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. మెడికల్ సీట్లు లభించటమే కష్టతరంగా మారుతుంది.
–కొమ్ము చంద్రశేఖర్,
జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం
మెడికల్ కళాశాలల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా బాధాకరం. ప్రజల నిర్ణయాన్ని గౌరవించైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ విధానాన్ని ఉపసంహరిస్తే బాగుంటుంది. ఇక్కడ మెడికల్ సీట్లు లభించక ఇతర రాష్ట్రాలు, దేశాలకు విద్యార్థులు తరలి వెళుతున్నారు. అదే 17 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే సీట్లు సులభంగా లభించటంతోపాటు పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
–ఏరువ కోటిరెడ్డి, విద్యావేత్త, నరసరావుపేట
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జిల్లా ప్రజలు నిరసన గళం వినిపించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున సాగింది. విద్యావంతులు, వ్యాపారు లు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రభుత్వం తీరును నిరసిస్తూ సంతకాలు చేశారు. సంతకాల ప్రతులను తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు సందర్భంగా సోమవారం నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేసిన నినాదాలతో పట్టణ వీధులన్నీ మారుమ్రోగాయి.
పేదలకు వైద్యం, విద్య అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారు. ఆయా కళాశాలలను చంద్రబాబు తన శిష్యులకు అమ్ముకుని పేదల నుంచి లక్షలు వసూలు చేసేందుకు కుట్ర చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు నెలల నుంచి ప్రజాఉద్యమం చేపట్టాం. నిరంకుశ పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు దిగివచ్చి ప్రైవేటీకరణను అపాలి. లంచాలు తీసుకుని మెడికల్ కళాశాలలను అమ్ముకున్నా రెండున్నర సంవత్సరాల్లో జగనన్న మరలా అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పరం చేస్తాడు.
–కాసు మహేష్‌రెడ్డి,
గురజాల మాజీ ఎమ్మెల్యే
నిరసన గళం
నిరసన గళం
నిరసన గళం
నిరసన గళం
నిరసన గళం
నిరసన గళం


