పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక
–నివాళులర్పించిన కలెక్టర్
నరసరావుపేట: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా పాల్గొన్నారు.
దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఇప్పటివరకు అందిన దరఖాస్తులను సోమవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా డీపీఆర్ ప్రీలిమీనరీ వెరిఫికేషన్ నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి సంజీవరావు, ఆర్‌డీఓ కె.మధులత పాల్గొన్నారు.
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి జాతీయ స్థాయి పెన్షనర్ అదాలత్ ఉపయోగపడుతుందని డీఆర్‌ఎం సుథేష్ణసేన్ పేర్కొన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో జాతీయస్థాయిపెన్షన్ అదాలత్ కార్యాక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పెన్షన్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గుంటూరు డివిజన్ ముందుండి పనిచేస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం అదాలత్‌లో 19 ఫిర్యాదులు నమోదు కాగా, సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో 10 ఫిర్యాదులు వేదిక వద్దనే పరిష్కరించారు. మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను డీఆర్‌ఎం ఆదేశించా రు. ఏడీఆర్‌ఎం, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం సీఈ ఆలపాటి శివప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎల్‌ఎల్‌బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్‌కు 1044 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 755 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎల్‌ఎల్‌బీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్‌కు 550 మంది హాజరు కాగా వారిలో 479 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 27 లోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ. 2070 చొప్పున చెల్లించాలన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ ఆన్సర్ బుక్‌లెట్ ఫీజు రూ. 2190 చెల్లించాలని తెలియజేశారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం నాంచారమ్మ ప్రాంగణంలో ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి స్వామివార్ల దేవాలయంలో సోమవారం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల శ్రీ భక్తమార్కండేయ పద్మశాలీ అన్నదాన సేవా సంఘం కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పండుగ వేళల్లో ధార్మిక సత్రాల ద్వారా భక్తులకు సేవలు చేసే భాగ్యం రావడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిన్నవీరయ్య, మాజీ కౌన్సిలర్ బట్టు సదానంద శాస్త్రి, సత్రం అధ్యక్షులు వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక
పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక


