కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక
నరసరావుపేటలో నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగించి సిబ్బంది జీతా లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు, తన మనషుల జేబులు నింపుకునే కార్యక్రమంలో భాగంగానే ప్రైవేటీకరణ విధానానికి తెరదీశారు. మెడికల్ కళాశాల ల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రానున్నరోజుల్లో ప్రభుత్వానికి బుద్ధిచెబుతారు.
–డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త.


