ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు! | - | Sakshi
Sakshi News home page

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు!

Dec 16 2025 4:26 AM | Updated on Dec 16 2025 4:26 AM

ముహూర

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు!

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు! అమరావతి: ఈ ఏడాది నవంబరు 27 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ వరకు అంటే 52 రోజులపాటు శుభముహూర్తాలు లేకపోవటంతో వివాహాలతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపన లు, నిశ్చితార్థాలు, అన్నప్రాసన, ఉపనయనం ఇలా అన్ని శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. ఈ రంగానికి అనుబంధంగా ఉండే వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సుమారు 50 రోజులపాటు ముహూర్తాలు లేకపోవటంతో వివాహాలకు ముహూర్తాలు లేక కల్యాణ మండపాలు రిజర్వు చేసుకునే వారే లేరు. సుమారు రెండు నెలలపాటు కల్యాణ మండపాలు ఖాళీగా ఉండటం వల్ల వాటి నిర్వహణ కష్టంగా మారింది. దీంతో కల్యాణ మండపాలలో పని చేసే కూడా వేరే కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముహూర్తాలు లేక వ్యాపార దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రధానంగా బంగారు ఆభరణాలు, అలంకరణ వస్తువులు, శుభకార్యాలకు అవసరమ య్యే సామగ్రి, పూల వ్యాపారాలకు బేరాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. శుభకార్యాలకు అధికంగా వ్యాపారం జరిగే నిత్యావసర వస్తువుల దుకాణాల్లోనూ రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. వివాహాది శుభకార్యాలు లేకపోవడంతో ప్రధానంగా పురోహితులకు, డెకరేషన్‌, సన్నాయి, బ్యాండు వాయిద్య కళాకారులకు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, పాట కచేరీల కళాకారులు, ఈవెంట్‌ నిర్వాహకులు ఉపాఽధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ల కోసం పనిచేసే సాంకేతిక నిపుణలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. విందు కోసం వంటకాలు వండి వడ్డించే లక్షల మంది క్యాటరింగ్‌ కార్మికులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సి వస్తోంది. క్యాటరింగ్‌, బ్యూటీపార్లర్‌ నిర్వాహకులు, ట్రావెల్స్‌ ఏజెన్సీల డ్రైవర్లు, క్లీనర్లు.. ఇలా ఒక పెళ్లి జరిగితే సుమారు 250 నుంచి వేయి మంది వరకు ఉపాధి పొందేవారు. ఇప్పుడు అత్యధిక శాతం మంది కూలీ పనులకు వెళుతున్నారు.

చాలా అరుదు

ఈ ఏడాది నవంబరు 27వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ వరకు అనగా 52 రోజులపాటు ఎటువంటి శుభ ముహూర్తాలు లేవు. మళ్లీ శుభకార్యాల కోసం మాఘమాసం వరకు ఆగాల్సిందే. ఇన్ని రోజులు శుభ మూహుర్తాలు లేకపోవటం చాలా అరుదుగా జరుగుతుంది.

ఇతర పనులకు వెళ్తున్న సిబ్బంది

ఇన్ని రోజులు ముహూర్తాలు లేకపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నాం. అలాగే మా దగ్గర పనిచేసే వారిని పోషించలేక పోవటంతో పనివారు వ్యవసాయ కూలీలుగా, తాపీ పనికి పోతున్నారు. సుమారు రెండు నెలలపాటు ఎటువంటి వ్యాపారం లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఇటు వ్యాపారులకు, అటు పనివారికి ఇబ్బందిగా ఉంది.

ఖాళీగా కల్యాణ మండపాలు

వెలవెలబోతున్న వ్యాపారాలు

ఉపాధి నిల్‌

52 రోజులపాటు

శుభ ముహూర్తాలు లేవు

వ్యాపారాలు వెలవెల

పురోహితులకు తగ్గిన ఆదాయం

కళాకారులకు, కూలీలకు

ఉపాధి కరువు

ప్రస్తుతం 52 రోజులపాటు ఎటువంటి శుభ ముహూర్తాలు లేక పోవడంతో కల్యాణ మండపా లు వెలవెలబోతున్నాయి. వివాహాలతోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్థాలు, అన్నప్రాసన, ఉపనయనం వంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు లేక అనేక మంది కళాకారులు, కార్మికులు, కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.

– పరాశరం రామకృష్ణమాచార్యులు, పురోహితుడు, అమరావతి

– తోట ఆనంద్‌కుమార్‌, డెకరేషన్‌, టెంట్‌హౌస్‌ వ్యాపారి, అమరావతి

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు! 1
1/2

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు!

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు! 2
2/2

ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement