వైభవం.. ఏపీఆర్‌జే కళాశాల స్వర్ణోత్సవం
విజయపురిసౌత్: వారంతా 50 ఏళ్ల క్రితం ఏపీఆర్ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆతరువాత విడిపోయారు. సుధీర్ఘ జీవన ప్రయాణంలో విభిన్నదారుల్లో సాగి వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించారు. జీవితం యాంత్రికమైపోయింది. ఒక్కసారి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాగర్ పరివార్ ఆధ్వర్యంలో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాలలో, వివిధ ఉద్యోగాలు చేస్తున్న సుమారు 5వేల మంది చిరునామాలు సేకరించారు. 1975 నుంచి 2025 వరకు ఏపీఆర్ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం మరోసారి అదే కళాశాలలో స్వర్ణోత్సవాల్లో తిరిగి కలుసుకుని ఒకే వేదిక పై చేరుకున్నారు. ఒక్కసారిగా అందరిలో ఉద్వేగం...అపురూపమైన ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పరస్పర పలకరింపులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్ నంబర్లు, చిరునామాలు సేరించుకున్నారు. తమ ఉన్నతికి దోహదపడిన ఆనాటి గురువులను గుర్తు చేసుకున్నారు. అపురూపమైన జ్ఞాపకాలను తమ స్నేహబంధానికి గుర్తుగా గ్రూఫ్ ఫొటోలు దిగారు. అనంతరం గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు, పూర్వ విద్యార్ధులకు కొమ్ముకోయ నృత్యంతో కళాశాలలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో స్వర్ణోత్సవ సావనీర్ ఆవిష్కరణ జరిపారు.
వీపీసౌత్ ఏపీఆర్‌జేసీలో 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు
వైభవం.. ఏపీఆర్‌జే కళాశాల స్వర్ణోత్సవం


