పథకాల అమలులో పల్నాడు జిల్లా ఫస్ట్
సదస్సుకు హాజరైన కలెక్టర్ కృతికా శుక్లా సదస్సులో వివరాలు వెల్లడి
నరసరావుపేట: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అనుబంధ పథకాల అమలులో పల్నాడు జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్‌గా నిల్చింది. 47 పథకాల అమలుకు సంబంధించి 91శాతం నిధులు ఖర్చు చేసి, 26 జిల్లాల్లో పల్నాడు జిల్లా మేటిగా నిల్చింది. జిల్లాలో మొత్తం రూ.167కోట్లకు గాను రూ.151కోట్లు లబ్ధిదారులకు నేరుగా చెల్లించడం లేదా వెచ్చించారు. 90శాతంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, 89శాతంతో నంద్యాల జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.


