ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి
నరసరావుపేట టౌన్: ఏరియా వైద్యశాలలో బాలింత మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు బుధవారం ఏరియా వైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. రెంటచింతల మండలం పాల్వాయి గేటుకు చెందిన సాగరమ్మ(21) గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం మంగళవారం ఏరియా వైద్యశాలలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు బుధవారం శస్త్ర చికిత్స చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో ఏరియా వైద్యశాల వద్దకు చేరుకున్నారు. రక్తం తక్కువ ఉన్న పేషెంటుకు ఆపరేషన్ ఎలా చేశారంటూ వైద్యురాలు, సిబ్బందిని నిలదీసి గొడవకు దిగారు. ఓ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సర్దిచెప్పారు.
వైద్యురాలి నిర్లక్ష్యంతోనే అంటూ
బంధువుల ఆందోళన


