పిన్నెల్లి సోదరులపై కక్ష సాధింపు చర్యలు
యడ్లపాడు: గుండ్లపాడు జంట హత్యల కేసులో టీడీపీలోని గ్రూపు తగాదాలే కారణమని అప్పటి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గతంలో ప్రకటించినప్పటికీ, ఈ కేసులో సంబంధం లేని పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్రరైతు కార్యదర్శి మద్దూరి విజయబాల చంద్రారెడ్డి, పార్టీ ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల ఐటీ విభాగం రీజినల్ కో–ఆర్డినేటర్ పాలూరి అంజిరెడ్డిలు పేర్కొన్నారు. యడ్లపాడు మండలం సొలస గ్రామంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. బాధితులు ఒక వివాహం నుంచి తిరిగి వస్తున్నప్పుడు, నిందితులు స్కార్పియో కారులో వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టి, రాళ్లతో కొట్టి చంపారని, ఈ హత్యలకు సంబంధం లేని పిన్నెల్లి సోదరులపై చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటివరకు 16 తప్పుడు కేసులు పెట్టినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామకృష్ణారెడ్డి బెయిల్ రద్దు కారణంగా కేవలం 21 రోజుల్లోనే మాల విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వారివెంట గుండ్లకుంట కోటిరెడ్డి, మద్దూరి సంజీవరెడ్డి, గండు వెంకటప్పయ్య, సుంకిరెడ్డి పుల్లారెడ్డి, గొట్టం హన్మంతు, పెరవలి శివకోటి, బొజ్జా శివకోటి, వెలుతుర్ల రోసిరెడ్డి, మంచా నవీన్, కారుచోల రామూర్తి, జిటిక నాని, విప్పర్ల దాసు, చలమచెర్ల వెంకట సుబ్బారావు, గొట్టం శంకర్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ నేతలు మద్దూరి
విజయబాల చంద్రారెడ్డి, పాలూరి అంజిరెడ్డి


