నేడు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం గ్రామసభలు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద బుధవారం రైతన్న మీకోసం గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెబెక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభలలో 2025–26 రబీ, 2026 ఖరీఫ్, 2026–27 రబీ సీజన్‌ల పంట ప్రణాళికలపై రైతులతో చర్చించాలన్నారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాల (నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు) ఆధారంగా పంట ప్రణాళిక తయారీలో అధికారులు, రైతులు భాగస్వాములు కావాలన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను మంగళవారం మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. భక్తులకు ప్రచార నిమిత్తం గోడపత్రికలను, ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


