నలుగురు యువకులు అరెస్ట్
కిలో గంజాయి స్వాధీనం
ముప్పాళ్ల: మహిళపై దాడికి పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పీ.అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల కిందట మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. నలుగురు యువకులు ఆమైపె దాడికి దిగారు. ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన బొరిగర్ల నాగరాజు, మధిర లక్ష్మీరెడ్డి, కుమ్మెత మహేశ్వరరెడ్డి, లంకెలకూరపాడు గ్రామానికి చెందిన కిష్టిపాటి శివనాగిరెడ్డిలను లంకెలకూరపాడు గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు.
కారెంపూడి: స్థానిక ఎస్సీ కాలనీలోని మురికి కాలువలో మంగళవారం నవజాత శిశువు మృతదేహం కన్పించింది. కన్న వెంటనే పాపను కాల్వలో పడేసినట్లుగా ఉంది. బొడ్డుపేగు కూడా అలాగే ఉంది. ఇది చూసి స్థానికులు చలించిపోయారు. కాల్వలో ఉన్న శిశువును వెలికితీసి పూడ్చి పెట్టారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపింది.


