ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా కార్యవర్గం ఏకగ
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా అసోసియేషన్ హాలులో సోమవారం ఏకాగ్రీవంగా నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా వి.హనుమంతరావు, జిల్లా అధ్యక్షులుగా ఎం.చంద్రశేఖర్, జిల్లా సెక్రటరీగా ఎం.శ్రీను, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సీహెచ్.నాగేంద్రబాబు, కోశాధికారిగా భాస్కరరెడ్డి, జాయింట్ సెక్రటరీగా విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్‌గా వెస్ట్ గోదావరి జిల్లా సెక్రెటరీ కిషోర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా ఏలూరు జిల్లా అసోసియేషన్ సభ్యులు ఆనంద్, ఎలక్షన్ అబ్జర్వర్‌గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూర్తి వ్యవహరించారు. ఎన్నికలు చక్కగా నిర్వహించినందుకు ఎలక్షన్ ఆఫీసర్స్‌కు రాష్ట్ర సంఘం తరఫున పసుపులేటి రఘుబాబు ధన్యవాదాలు తెలియజేశారు.


