గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
యడ్లపాడు: దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పా ట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి సిబ్బందిని ఆదేశించారు. యడ్లపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వినికిడి లోపం ఉన్నవారి వివరాలు సేకరించి ఈనెల 7న ప్రత్తిపాటి గార్డెన్‌లో జరిగే ప్రత్యేక వైద్య శిబిరానికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్ 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. పారిశుద్ధ పరిస్థితులను పరిశీలించి, జ్వరాలు, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన పనుల పురోగతిని పరిశీలించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి భరద్వాజ, సూపర్‌వైజర్ వి రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.రవి


