సంపూర్ణ ఆరోగ్య సూత్రమే యోగా
గుంటూరువెస్ట్(క్రీడలు): సంపూర్ణ ఆరోగ్య మహా సూత్రమే యోగా అని యోగా శిక్షకుడు వంగా వెంకటేష్ అన్నారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని జాయ్‌అండ్ షైన్ వెల్‌నెస్ సెంటర్లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సంక్లిష్టమైన కరోనా సమయంలో యోగా సాధ కులు అధిక సంఖ్యలో అకాలమరణం పాలు కాకుండా జీవించడానికి కారణం యోగా సాధ నే అని తెలిపారు. రోజుకు కనీసం 45 నిమిషాలైనా యోగా, మెడిటేషన్ సాధన చేస్తే జీవన కాలాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. జాయ్ అండ్ షైన్ వెల్‌నెస్ సెంటర్ ఫిటెనెస్ కోచ్ కె.జ్యోతిశ్యామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణతోపాటు ఫిట్‌నెస్, చక్కని ఆరోగ్యం తదితర అంశాలపై ప్రముఖులతో పాఠాలు చెప్పిస్తామన్నారు. అనంతరం యోగా తరగతులను వెంకటేష్ నిర్వహించా రు. అయితి సతీష్, భావన్నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ యానీ అమల ఉన్నారు.


