రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు

Dec 2 2025 8:18 AM | Updated on Dec 2 2025 8:18 AM

రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు

రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు

రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు

గురజాల: పట్టణంలో వేంచేసియున్న శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి 427వ తిరునాళ్లను పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ నుంచి గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, రైతు సంఘం, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఏపీ ఒంగోలు జాతి పశుపోషక రైతు సంక్షేమ సంఘం వారి ప్రతిపాదనలు అనుసరించి నిర్వహించనున్నట్లు తెలిపారు. సీనియర్‌ విభాగంలో ప్రథమ బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.80 వేలు, మూడో బహుమతి రూ.70 వేలు, నాల్గవ బహుమతి రూ.60 వేలు, ఐదో బహుమతి రూ.50 వేలు, ఆరో బహుమతి రూ.30 వేలు, ఏడో బహుమతి రూ.20 వేలు, ఎనిమిదో బహుమతి రూ.15 వేలు, తొమ్మిదో బహుమతి రూ.10 వేలు, జూనియర్స్‌ విభాగంలో ప్రథమ బహుమతి రూ.55 వేలు, రెండో బహుమతి రూ.45 వేలు, మూడో బహుమతి రూ.30 వేలు, నాల్గవ బహుమతి రూ.20 వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరో బహుమతి రూ.8వేలు, ఏడో బహుమతి రూ.7వేలు, ఎనిమిదో బహుమతి రూ.5వేలు, న్యూ కేటగిరి విభాగంలో ప్రథమ బహుమతి రూ.45వేలు, రెండో బహుమతి రూ.35వేలు, మూడో బహుమతి రూ.25 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు, ఐదో బహుమతి రూ.10 వేలు, ఆరో బహుమతి రూ.7 వేలు, ఏడో బహుమతి రూ.5వేలు, 6 పళ్ల జతల విభాగంలో ప్రథమ బహుమతి రూ.30వేలు, రెండో బహుమతి రూ.25వేలు, మూడో బహుమతి రూ.20వేలు, నాల్గవ బహుమతి రూ.15వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరవ బహుమతి రూ.7వేలు, ఏడవ బహుమతి రూ.5వేలు, నాలుగు పళ్ల జతల విభాగంలో ప్రథమ బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.20వేలు, మూడో బహుమతి రూ.15వేలు, నాల్గవ బహుమతి రూ.10 వేలు, ఐదో బహుమతి రూ.8వేలు, ఆరో బహుమతి రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పోటీల స్థలం పరిశీలించిన పులుకూరి

ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహించే గ్రౌండ్‌ను నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పులుకూరి కాంతారావు సోమవారం పరిశీలించారు.

గతంలో మాడుగుల రోడ్డులో పోటీలు నిర్వహించేవారని, అనివార్య కారణాల వలన ఈ ఏడాది పులిపాడు రోడ్డులోని సిరి వెంచర్‌ సమీపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అందరూ పాల్గొని పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పోటు నాగేశ్వరరావు, నవులూరి శ్రీరామమూర్తి, నెల్లూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఐదు నుంచి ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement