హైవేపై అడ్డదారులతో ప్రమాదాలకు ఆస్కారం
నాదెండ్ల: జాతీయ రహదారి గణపవరం–చిలకలూరిపేట మార్గంలో మూడు అనధికార అడ్డదారులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే హైవేపై ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటేందుకు అడ్డదారులు ఏర్పాటు చేసుకున్నారు. మూడు కిలోమీటర్ల నిడివిలో మూడు చోట్ల ఉన్న అడ్డదారుల కారణంగా రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాతపడగా, ఎంతోమంది గాయాలపాలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు, రాళ్లు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి రాకపోకలు సాగిస్తున్నారు. గణపవరం సమీపంలో విష్ణు స్పన్‌పైప్స్ ఎదురుగా, కుప్పగంజివాగు బ్రిడ్జి సమీపంలో, నూతనంగా ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్‌బంకు ఎదురుగా డివైడర్‌పై మూడు అడ్డదారులు ఉన్నాయి. నేషనల్ హైవే అధికారులు, పోలీసులు స్పందించి డివైడర్‌పై ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి అడ్డదారులు మూసివేయాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
హైవేపై అడ్డదారులతో ప్రమాదాలకు ఆస్కారం
హైవేపై అడ్డదారులతో ప్రమాదాలకు ఆస్కారం


