వైద్యశాలలో కాన్పుల సంఖ్య పెంచాలి
రాజుపాలెం: ప్రభుత్వ వైద్యశాలలో కాన్పుల సంఖ్య పెరిగేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. రోగులు, గర్భిణులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్ష ల్యాబ్‌లో జరిగే రక్త పరీక్ష నమూనాలను పరిశీలించారు. వైద్యశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన డాక్టర్ పౌల్‌కి సూచించారు. ఆయన వెంట జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ హనుమ కుమార్ తదితరులు ఉన్నారు.
అచ్చంపేట: స్థానిక ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ఆవరణలో ఈనెల 16న పల్నాడు జిల్లాస్థాయిలో పురుషులకు, సీ్త్రలకు రెజ్లింగ్ (కుస్తీ) ఎంపికలు జరుగుతాయని పల్నాడు జిల్లా అమెచ్యూర్ అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొనేవారు 2005 సంవత్సరానికి ముందు జన్మించిన వారై ఉండాలన్నారు. 2006, 2007లో జన్మించిన వారు మెడికల్ సర్టిఫికెట్‌తోపాటు తల్లిదండ్రుల అనుమతి పత్రం తెచ్చుకోవాలన్నారు. ఎంపికలకు హాజరయ్యేవారు ఒరిజనల్ పుట్టినతేదీ ధృవపత్రంతోపాటు ఆధార్ కార్డు తెచ్చుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9441936823 నెంబరుకు ఫోను చేసి సంప్రదించవచ్చన్నారు.


