మోంథా తుపాను ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 278 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చిలకలూరిపేట, వినుకొండ, నరసరావుపేట నియోజకవర్గాలపై అధిక ప్రభావం పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు 53,475 ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలకు భారీ నష్టం
సాక్షి, నరసరావుపేట: మోంథా తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 278 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా చిలకలూరిపేటలో 22 సెం.మీ., యడ్లపాడులో 17 , నాదెండ్లలో 13, శావల్యాపురంలో 13, బొల్లాపల్లి 12 సెం.మీ. నమోదైంది.
గుండ్లకమ్మ ఉగ్రరూపం
మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలుల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా వరద నీరు చేరింది. వినుకొండ రూరల్ మండలంలోని అందుగల కొత్తపాలెం, మదమంచిపాడు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వంతెన పైనుంచి ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహించడంతో గుంటూరు–ప్రకాశం జిల్లాల రాకపోకలు స్తంభించాయి. దీంతో నక్క వాగు కూడా పొంగింది. సమీప పొలాల్లోకి వరద నీరు భారీగా చేరింది. వ చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం వద్ద హైవే బైపాస్ వంతెన కింద మంగళవారం అర్ధరాత్రి ఐదు అడుగుల ఎత్తు మేర వరద నీరు పారింది. దాదాపు 10 గంటల పాటు యడ్లపాడు– తిమ్మాపురం వైపు వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. రహదారిపై భారీగా చేరిన నీరు హైవే సర్వీసు రోడ్డు వెంట నిర్మించిన చిన్నపాటి డ్రైన్లలోకి వెళ్లకపోవడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి చేరింది. బైపాస్ వంతెన నిర్మాణం వల్లే తమ పంట పొలాల్లోకి నీరు చేరిందంటూ రైతులు పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాను ప్రభావం పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంపై చూపిందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని తిమ్మాపురం బైపాస్ వంతెన అండర్‌పాస్ ప్రాంతాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హైవే రహదారిపై రాకపోకలకు అడ్డంగా నిలిచిన నీటిని, నక్కవాగు వైపు నీట మునిగిన పొలాలు, హైవే డ్రైనేజీ ప్రాంతాలను పరిశీలించారు.
భరోసానిచ్చిన వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నేతలు, కార్యకర్తలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాఽధిత ప్రజలకు భరోసానిచ్చి వారిని ఆదుకున్నారు. మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు వారి నియోజకవర్గాలలో తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరద ముంపు పెరిగిందని విమర్శించారు.
వృద్ధురాలి మృతి
తుఫాను తీవ్రతకు పాత ఇంటి గోడ కూలిపోవడంతో మర్రెడ్డి రావులమ్మ (90)అనే వృద్ధురాలు దుర్మరణం చెందారు. వినుకొండ పట్టణంలోని ఆకులవారి వీధి రామాలయం బజారులో నివాసం ఉంటున్న రావులమ్మపై గోడ కూలి పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.
●నూజెండ్ల మండలం కొండల్రాయునిపాలెంలో గొర్రెల మందలోకి వరద నీరు చొచ్చుకు రావటంతో 11 జీవాలు మృతి చెందాయి.
●వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన చెంచు గిరిజనుడు గురవయ్యకు చెందిన రూ. 2లక్షల విలువైన 10 మేకలు వాగులో గల్లంతయ్యాయి.
●తుపాను ప్రభావంతో ఐదు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. సిబ్బంది బుధవారం మధ్యాహ్నానికి పునరుద్ధరించారు.
ఉరకలెత్తిన మిర్చి
పదకొండు ఎకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో కంది, నాలులు ఎకరాల్లో మొక్కజొన్న, మూడెకరాల్లో మిర్చి సాగు చేశా. పత్తి తీసే దశలో తుపాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది. కంది, మొక్కజొన్న నేలవాలింది. మిర్చి తోటల్లో నీరు చేరటంతో మొక్కలు ఉరకెత్తాయి. ఈ తుఫానుతో తీవ్రంగా నష్టపోయా.
– వడ్లమూడి శ్రీకాంత్, రైతు,
గణపవరం
మోంథా తుపాను జిల్లా రైతులను కన్నీటిపాలు చేసింది. వాగులు
మోంథా తుపాను జిల్లా రైతులను కన్నీటిపాలు చేసింది. వాగులు
మోంథా తుపాను జిల్లా రైతులను కన్నీటిపాలు చేసింది. వాగులు


