వరి పంట తీవ్రంగా దెబ్బతింది
పది ఎకరాల్లో వరి సాగు చేశా. ఇందులో ఐదు ఎకరాలు లేత వరి కావడంతో ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేదు, అయితే, మరో ఐదు ఎకరాల్లో పూర్తిగా నేలకొరిగింది. రూ.1.70 లక్షల నష్టం వాటిల్లుతోంది. వర్షాలతో నాలాంటి రైతులు ఎంతో మంది భారీగా నష్టపోయారు. ప్రభుత్వమే నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి.
–వెన్నపూస కొండారెడ్డి,
ఎడ్వర్డ్‌పేట, రొంపిచర్ల మండలం
నీళ్ల ఇంజిన్, పైపులు
కొట్టుకుపోయాయి
కుప్పగంజివాగు సమీపంలో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. గేదెలకు మేతగా మరో రెండెకరాల్లో జొన్న వేశా. తుపాను కారణంగా పత్తి పూర్తిగా దెబ్బతింది. వాగు నీరు ముంచెత్తడంతో నీళ్ల ఇంజిన్, 22 పైపులు కొట్టుకుపోయాయి. రూ.1.20 లక్షల మేర నష్టపోయా.
– సమ్మెట మురళీకృష్ణారెడ్డి, రైతు, గణపవరం
పత్తికి తీవ్ర నష్టం
నాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది సాగు చేశా. పత్తి తీతలు ప్రారంభమయ్యే దశలో తుపాను కారణంగా కాయలు కుళ్లిపోయాయి. ఎకరాకు 3–5 క్వింటాళ్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కంది పంట పూర్తిగా నేలవాలింది.
బొల్లా మాలకొండయ్య, రైతు, నాదెండ్ల
వరి పంట తీవ్రంగా దెబ్బతింది
వరి పంట తీవ్రంగా దెబ్బతింది
వరి పంట తీవ్రంగా దెబ్బతింది


