చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెడతాం
వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వెళ్లిన చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. దీనిపై పార్టీలో చర్చించి అధిష్ఠానం ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. టీడీపీకి ఒక్క ఎంపీటీసీ కూడా లేని మండలాల్లో సైతం వైసీపీ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి, వైసీపీ సభ్యులను బెదిరించి కుర్చీని కై వసం చేసుకుంటున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో పూర్తి మెజా ర్టీతో కై వసం చేసుకున్న జెడ్పీ పీఠాన్ని తిరిగి వైఎస్సార్ సీపీ సొంతం చేసుకునేలా ముందుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీలు రమావత్ భీమీబాయ్, కల్లూరి అన్నపూర్ణమ్మ, పిల్లా ఉమాప్రణుతి, గుండాల స్వీమోన్ పాల్గొన్నారు.


