వేల ఎకరాల్లో పంట నష్టం
మోంథా పల్నాడు రైతులను తీవ్రంగా నష్టపరిచింది. చేతికందిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 53,475 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 43,375 ఎకరాల్లో పత్తి, 5250 ఎకరాల్లో వరి, 3,048 ఎకరాల్లో మిర్చి, 915 ఎకరాల్లో మొక్కజొన్న, 450 ఎకరాల్లో కంది, 200 ఎకరాల్లో మినుము, మరో 237 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నష్ట వివరాలు సేకరిస్తే ఇది మరింత పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


