
వ్యవసాయశాఖ కమిషనర్‌కు అభినందనలు
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్‌ను గుంటూరు చుట్టుగుంటలోని కార్యాలయంలో ఏపీ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి, అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువుల లభ్యత గురించి కమిషనర్‌కు వివరించారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ జిలానీ సమూన్ తెలిపారు. డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కె.విజయకుమార్, ఉపాధ్యక్షులు చక్కా రవికుమార్, భీమవరపు శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆర్.చలపతిరావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.