
మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చొరవ చూపించిన మంత్రి నారా లోకేష్
తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరదల కారణంగా వల విసరక మత్స్యకారులకు భుక్తి కరువైంది. దయనీయంగా జీవిస్తున్నారని సాక్షిలో అక్టోబర్ 1వ తేదీన కథనం వెలువడింది. దీనికి స్పందించిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయంతో గురువారం మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగ పుత్రులు వేట లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయంతో 300 మందికి రెండు వేల రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ