
ముందస్తు పంటగా సజ్జసాగు ఎంతో మేలు...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, శనగ, జ్యూట్ సాగు చేసే రైతులు ముందస్తు పంటగా సజ్జ వేస్తే అధిక దిగుబడి, ఆదాయం, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. జిల్లాలో రబీలో 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 25 వేల ఎకరాల్లో శనగ సాగవుతున్నాయి. అలాగే జాలాది గ్రామంలో 25 ఎకరాల్లో ఏబీవీ–04 రకం సజ్జ సాగు చేయగా, పక్షం రోజుల్లో కోతకు రానుంది. ఎకరానికి 14–16 క్వింటాళ్ల దిగుబడి అంచనా. ఈ రకం నల్లరేగడి మెట్ట ప్రాంతాలు సాగుకు అనుకూలం.
– డాక్టర్ ఎం. నగేష్. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, పల్నాడు జిల్లా