జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు | - | Sakshi
Sakshi News home page

జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు

Oct 15 2025 6:34 AM | Updated on Oct 15 2025 6:34 AM

జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు

జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు

● ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో జోగి రమేష్‌ ప్రస్తావన ఎందుకు లేదు ● నకిలీ మద్యంపై రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా వైఎస్సార్‌ సీపీపై మోపడం దుర్మార్గం ● ముందురోజు సీఎం మాటలే జనార్దనరావు వీడియో ప్రసంగం ● జనార్దనరావు ఫోను గుట్టు తేల్చండి ● సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయం ● వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు

ఒంగోలు సిటీ: కుటీర పరిశ్రమల్లా నకిలీ మద్యం తయారుచేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా వైఎస్సార్‌ సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలు పరా కాష్టకు చేరాయని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. దానిపై ఎల్లో మీడియా రెచ్చిపోతూ, నిన్న సాయంత్రం నుంచే ట్రోల్స్‌ చేస్తోందన్నారు. కేవలం వైఎస్సార్‌ సీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా కక్ష సాధింపులకు పాల్పడడం, కేసు నుంచి తాము బయట పడేందుకు డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగా సీఎం చంద్రబాబు చేసిన కుట్ర అని దుయ్యబట్టారు. ‘అసలు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్‌ చేశాడు? పైగా తన ఫోన్‌ పోయిందని చెప్పినట్లు ఎల్లో మీడియాలోనే వచ్చింది. అలాగే ఏ కేసులో నిందితుడైనా, ఇన్వెస్టిగేషన్‌ అధికారుల ముందు ఏదైనా చెప్పాల నుకున్నప్పుడు నిలబడి, చేతులు కట్టుకుని మాట్లాడతారు. కానీ నిన్న జనార్దన్‌రావు లీక్‌ చేసిన వీడియోలో ఆయన చైర్‌లో కూర్చుని ఉన్నాడు. పక్క నుంచి ఎవరో ప్రామ్ట్‌ చేస్తునట్లుగా ఉంది. పైగా తను ఆఫ్రికా నుంచి వచ్చినప్పటి డ్రెస్‌తోనే ఉన్నాడు. మరి ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎవరి ఫోన్‌లో రికార్డు చేశారు? ఇదంతా చూస్తుంటే, ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర మాదిరిగా కనిపించ డం లేదా’ అని వరికూటి ప్రశ్నించారు. ఆ వీడియో ను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అన్నది తేలాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొన్నా రు. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్‌లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. జనార్దనరావు గత వారం ఆఫ్రికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్‌ చేశాడని, నకిలీ మద్యం తయారీలో పార్టీ, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని, తామే ఆ పని చేశామని చెప్పు కొచ్చాడన్నారు. ఆ రోజే మరి నిజంగా జోగి రమేష్‌ పేరు ఎందుకు ప్రస్తావించలేదని, రమేష్‌ చెబితేనే తాను నకిలీ మద్యం తయారుచేసిన విషయాన్ని ఆ వీడియోలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు సన్నిహితుడే..

కేసులో ఏ–1 నిందితుడైన జనార్దనరావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడేనని, 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్‌ ఇచ్చినప్పుడు జనార్దనరావు అక్కడే ఉన్నాడన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటా రు. జనార్ధనరావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతమన్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా జనార్దనరావుకు రమేష్‌ సన్నిహితుడన్న వాదన అవాస్తవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement