
కల్తీ మద్యంపై కన్నెర్ర
న్యూస్‌రీల్
జిల్లావ్యాప్తంగా కొనసాగిన నిరసన ర్యాలీలు వర్షాన్ని సైతం లెక్కచేయక కదం తొక్కిన మహిళలు ఎకై ్సజ్ కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ కల్తీ మద్యంపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై ఆగ్రహం పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా, డాక్టర్ గజ్జల సుధీర్‌రెడ్డి, మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు
పల్నాడు
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
నకిలీ మద్యం తయారు చేస్తూ.. దాన్ని ఊరు, వాడా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి మహిళలు రణభేరి మోగించారు. ప్రజల ప్రాణాలంటే లెక్కచేయని పాషాణ ప్రభుత్వపు కూసాలు కదిలేలా పదం పదం కలుపుతూ.. కదం తొక్కారు. జిల్లాలోని చాలా ఊళ్లకు మంచినీటి సరఫరా లేదు గానీ నకిలీ మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నారంటూ గర్జించారు. నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు ఆధారాలతో సహా పట్టుబడినా.. ప్రభుత్వ పెద్దలు బుకాయించడం.. ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని నిరసన గళం వినిపించారు.
కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సీబీఐ విచారణ జరిపించాలి
ఈనాం భూములను బోయలకే కేటాయించాలి
పులిచింతల సమాచారం
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 41,082 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 82,027 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
సీహెచ్‌సీ సందర్శన
పొన్నూరు: నిడుబ్రోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల సంరక్షణే
ప్రథమ బాధ్యత
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావుపేట: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో భోజనం, తాగునీరు, వసతులు, ప్రథమ చికిత్స, పారిశుద్ధ్యం వంటి కనీస వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంరక్షణే ప్రప్రథమ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లపై తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డయేరియా, వివిధ రకాల జ్వరాలు నమోదైతే ఎలా స్పందించాలో తెలుపుతూ మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కాచి వడగట్టిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. అన్ని వసతి గృహాల్లో మూడు రోజుల్లోగా తాగునీటి పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. బయటినుంచి ఆహార పదార్థాలను నిషేధించాలన్నారు. వసతి గృహాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సి పల్ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. వసతి గృహ విద్యార్థులు పదోతరగతి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. డీఈఓ చంద్రకళ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, డీపీఓ నాగేశ్వర్ నాయక్, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నేడు నకిలీ మద్యంపై నిరసన
నరసరావుపేట: రాష్ట్రంలో వెలుగుచూసిన నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారికి వినతిపత్రం అందజేయటం జరుగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరి ప్రకాష్‌నగర్‌లోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 10గంటలకు పార్టీ కార్యాలయం వద్దకు తరలిరావాలని కోరారు.
టెయిల్‌పాండ్ నుంచి 58,122 క్యూసెక్కులు విడుదల
రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 5 క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 58,122 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 5 క్రస్ట్‌గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 49,720 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,402 క్యూసెక్కులు మొత్తం 58,122 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందన్నారు.
ఐటీఐ ఐదో విడత అడ్మిషన్లకు దరఖాస్తులు
మాచర్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఐదో విడత అడ్మిషన్ల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్, మాచర్ల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.నరేంద్ర సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో www.iti.ap. gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4గంటలలోపు తమ కళాశాలకు వచ్చి ధ్రువీకరించుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 17న ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలోని ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.
సాక్షి, నరసరావుపేట: ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు కదం తొక్కారు. నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టిన నిరసన ర్యాలీలు, ఎకై ్సజ్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేసే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కూటమి ప్రభుత్వం మద్యం విధానాలను తూర్పారబట్టారు. కల్తీ మద్యంపై సిట్ విచారణ కాకుండా సీబీఐ విచారణచేపట్టాలని డిమాండ్ చేశారు.
నకిలీ మద్యం ఏరులై పారుతోంది
నారా వారి పాలనలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత విడదల రజిని విమర్శించారు. నకిలీ మద్యంపై వైఎస్సార్ సీపీ రణభేరి కార్యక్రమం సోమవారం చిలకలూరిపేటలో నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి మాజీ మంత్రి ర్యాలీ నిర్వహించారు. అడ్డరోడ్డు సెంటర్ నుంచి చిలకలూరిపేట ఎకై ్సజ్ స్టేషన్‌కు ప్లకార్డులు చేతబట్టి నకిలీ మద్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఎకై ్సజ్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ నకిలీ మద్యం తయారు చేస్తూ, అక్రమ పద్ధతిలో విక్రయాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ నాయకులు పట్టుబడినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా, పరిశ్రమ మాదిరిగా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. గ్రామ గ్రామాన వెలిసిన బెల్టుషాపులతో ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి అధికార పార్టీ నాయకులే వేలం పాటలు నిర్వహించి ఏర్పాటు చేయించటం సిగ్గుచేటన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జరిగేవని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే సిట్ దర్యాప్తు కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చటం కోసమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
పెదకూరపాడులో...
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో సోమవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి ఎకై ్సజ్ సీఐ టి.తులసికి వినతిపత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఈదా సాంబిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతుందన్నారు.
గురజాలలో..
నకిలీ మద్యం వలన ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోయారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), వైఎస్సార్ సీపీ బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీలు అన్నారు. గురజాల ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమ లాగా నారా వారి నకిలీ మద్యం ఉందన్నారు. నకిలీ మద్యంపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. అలాగే పిడుగురాళ్లలో స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు వినతి పత్రం అందించారు. పార్టీ గురజాల నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కన్వీనర్ షేక్ జైలాబ్ధిన్, పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్‌కుమార్, చింతా సుబ్బారెడ్డి, దాదినబోయిన ఏడుకొండలు పాల్గొన్నారు.
మాచర్లలో...
మాచర్లలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ జరిపి కూటమి ప్రభుత్వం మద్యం విధానాలను నాయకులు తూర్పారబట్టారు. అనంతరం పీడబ్ల్యూడీ కాలనీలోనీ ఎకై ్సజ్ స్టేషన్ ముందు ధర్నా, నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్ మాట్లాడుతూ టీడీపీ నేతలే రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి విక్రయించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు సిట్ పేరుతో నాటకాలకు తెరదీశారన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, బీసీ విభాగం నియోజక వర్గ అధ్యక్షుడు బూడిద శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు మాచర్ల సుందరరావులు మాట్లాడారు.
గురజాలలో ఎకై ్సజ్ ఎస్‌ఐకి వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
మాచర్లలో ఎకై ్సజ్ సీఐ వెంకటరమణకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
క్రోసూరులో ఎకై ్సజ్ సీఐ టి.తులసికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
కాలనీలో మౌలిక వసతులు
కల్పించండి
చిలకలూరిపేటరోడ్డులోని ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి సమీపంలో గల అస్ఫాఖుల్లాఖాన్ కాలనీలో 15ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. కాలనీలో రోడ్లు, సైడు కాలువలు, వీధిలైట్లు లేవు. కనీసం చెత్త సేకరించే బండికూడా రావట్లేదు. వర్షాలకు మట్టిరోడ్లన్నీ బురదమయంగా మారి నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. నీరు నిల్వుండి దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నాం. కాల నీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి.
–కె.అరుణ, అంజమ్మ, ఫాతిమా, మహబూబి, అస్పాఖుల్లాఖాన్ కాలనీ వాసులు
చిలకలూరిపేట జమిందారు బోయలకు ఇచ్చిన 2502 ఎకరాల ఈనాం భూములు బోయలకే చెందేలా ఉత్తర్వులు ఇవ్వండి. ఈ ఈనాం భూములను బోయలకు చెందకుండా ఆనాటి కరణాలు అగ్రవర్ణాలకు బినామీలుగా కట్టబెట్టారు. ఇప్పటివరకు 34 అర్జీలు పెట్టినా చర్యలు తీసుకోలేదు. దొంగ రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ రద్దుచేసి, ఎవరికి పనికిరాని ఫారం–8 రైత్వారీ పట్టాలు రద్దుచేసి నిజమైన వారసులను గుర్తించేవరకు ప్రభుత్వ స్వాధీనంలో భూములు ఉంచగలరు.
–దగ్గు నరసింహారావు, ఉమ్మడి గుంటూరు బోయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
7
కుటీర పరిశ్రమగా నకిలీ మద్యం
సంపద సృష్టించటమంటే కుటీర పరిశ్రమ లాగా నకిలీ మద్యం తయారీ చేయటమేనా చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి ప్రశ్నించారు. నకిలీ మద్యం అరికట్టి, జరిగిన సంఘటనలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ సోమవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు సత్తెనపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్సార్ సీపీ నాయకుల, మహిళల ర్యాలీ ఎకై ్సజ్ స్టేషన్ వరకు సాగింది. అనంతరం ఎకై ్సజ్ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సుధీర్ భార్గవరెడ్డి అందించి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యం మాఫియా నడుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందన్నారు. మద్యం కుంభకోణంపై నిజాలు రాస్తున్న సాక్షి మీడియాపై కేసులు పెడుతూ, దాడులకు దిగడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో వందలాది కుటుంబాలు నకిలీ మద్యానికి బలైపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీగా నరసరావుపేట రోడ్డు లోని ఎకై ్సజ్ స్టేషన్ వరకు వెళ్లి సీఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు అమాయకుల ప్రాణాలు బలిగొనడం దారుణమన్నారు. ప్రభుత్వం ఒక వైపు నకిలీ మద్యం తయారు చేయిస్తూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాటాలు పంచుకుంటూ.. మరో వైపు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మార్చారని విమర్శించారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర

కల్తీ మద్యంపై కన్నెర్ర