
జాలలపాలెంలో దళితుల ఇళ్లు కూల్చవద్దు
నరసరావుపేట: వినుకొండ మండలం జాలలపాలెంలోని తమ ఇళ్లు కూల్చవద్దంటూ దళితులు ప్రజాసంఘాల సహకారంతో కలెక్టర్ కృతికా శుక్లాను కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు మాట్లాడుతూ జాలలపాలెంలోని 175 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని కొంతమంది హైకోర్టులో లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. ఆ మేరకు హైకోర్టు 2023లో ఉత్తర్వులు ఇవ్వగా నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే గత 20 రోజులు నుంచి పంచాయతీ సెక్రటరీ భాగ్యలక్ష్మి, వీఆర్‌ఓ గోపాలరావులు దళితులు నివేశ స్థలాలు ఏర్పాటుచేసుకున్న 68/2 సర్వేనెంబర్‌లో గల 58 సెంట్లు భూమి నుంచి వారిని ఖాళీ చేయాలని, ఇళ్లు కూల్చివేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మూడు తరాలుగా గ్రామ కంఠం భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కట్టించిన ఇళ్లల్లో దళితులు నివాసం ఉండగా, వాటిని ఖాళీ చేయాలని, కూల్చాలనే ఆలోచన అధికారులు మానుకోవాలని కోరారు. ఎవరైతే రికార్డులు ట్యాంపరింగ్‌కు పాల్పడి గ్రామకంఠం భూమిని వేరేలాగా చూపిన రెవెన్యూ వారిపై చర్యలు తీసుకొని అక్కడ ఉన్న నివాస దారులకు రక్షణ కల్పించి, 175 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కోట నాయక్, దేశభక్త ప్రజాతంత్ర సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, గ్రామస్తులు పిడతల అంకారావు, మునెయ్య, నారాయణ, కొమ్మతోటి బాలస్వామి పాల్గొన్నారు.
అక్రమ లీజును రద్దు చేయండి
బెల్లంకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి చెందిన తొమ్మిది సెంట్ల ఖాళీ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు పీఎస్‌కే మస్తాన్ షరీఫ్ అధికారులతో కుమ్మకై ్క జిల్లా పరిషత్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లీజు హక్కు లు పొందటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం అర్జీ అందజేశారు. ఆ అక్రమవేలం లీజును రద్దుచేసి తిరిగి బహిరంగంగా నిర్వహించాలని అధికారులను కోరా రు. బెల్లంకొండ మండలం జెడ్పీటీసీ సభ్యుడు గాదె వెంకటరెడ్డి, మండల వైస్ కన్వీనర్ పాకాలపాటి షేక్ మౌలాలి, కో–ఆప్షన్ మెంబర్ కావూరి షేక్ దరియా, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గుర్రాల షేక్ బడా బచ్చా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గడ్డిపర్తి చినబాబురావు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామాంజనేయులు నాయక్ ఉన్నారు.
ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలి
క్రోసూరు పంచాయతీ పరిధిలోని యర్రబాలెం గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించాలని గ్రామ ప్రత్యేక పంచాయతీ సాధనా కమిటీ సభ్యులు తిమ్మిశెట్టి హనుమంతరావు, సోడిశెట్టి నీలేశ్వరావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో 3 వేల మంది జనాభా, రెండువేల వరకు ఓటర్లు ఉన్నారని అన్నారు. ప్రత్యేక పంచాయతీ కావాలని ప్రజల్లోకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రజలందరూ తమ సంతకాల ద్వారా ఆమోదం తెలియజేస్తున్నారని, ఒకరిద్దరూ అవకాశవాద రా జకీయ నాయకులు మా త్రమే ఆటంకం కలిగిస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. క్రోసూరు పంచాయతీలో యర్రబాలెం గ్రామం కలిసి ఉన్నందున నిధులు కేటాయింపు సరిగా లేదన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు గ్రామసభ లు ఏర్పాటు చేయమని అడిగినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని, విధులు ఎంత కేటాయిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం వారు జిల్లా పంచాయతీ అధికారిని కలిసి మాట్లాడారు.
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కోరిన
ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు