
ఎస్‌ఐ మారినప్పుడల్లా వేధింపులు..
మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలో చదువుకుంటున్న అమ్మాయిలను ఇప్పుడు స్టేషన్‌కు రావాలని పోలీసులు ఫోన్ చేసి వేధిస్తున్నారని క్రోసూరు మండలం యర్రబాలెంకు చెందిన మేకుల రోజానమ్మ జిల్లా ఎస్పీ ఎదుట వాపోయింది. గతంలో పొగాకు పనికి వచ్చేందుకు తన వద్ద పల్లె ప్రతాప్, మేరీలు రూ.లక్ష తీసుకున్నారని, పనికి రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వ మని తాను అడగటం జరిగిందన్నారు. దీంతో గొడవకు దిగిన వారు తనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారని తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి ఎస్‌ఐలు మారినప్పుడల్లా కేసుపై మాట్లాడాలని తనను, తన కుమార్తెలను స్టేషన్‌కు పిలిపిస్తున్నారని వాపోయారు. ఇప్పుడు తన కుమార్తెలు దేవి, భార్గవితో పాటు తన ఆడబిడ్డ కుమార్తెలు దేవిశ్రీప్రియ, ప్రసన్నకుమారిలను కూడా కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపారు.