
పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సెలక్షన్ టీం కమిటీ సభ్యులు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి తెలిపారు. ఆట్యా–పాట్యా రాష్ట్రస్థాయి పోటీలకుగాను పల్నాడు జిల్లా సెలక్షన్స్ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 50మంది పురుషులతో, 40 మంది మహిళలతో జిల్లా జట్టు ఎంపిక జరిగిందన్నారు. ఈ జట్టు ఈనెల 25, 26 తేదీలలో నకరికల్లులోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో క్రీడా ఉపాధ్యాయులు డి.మణి, బి.పెదవెంకటేశ్వర్లు, మద్దం వెంకటేశ్వర్లు, ఎన్.జానకిరామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.