
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పల్నాడు: ఏపీలో వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా పిడుగురాళ్ల పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ వెన్న రాజశేఖర రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.