
వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగ కమిటీ నియామకం
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా యువజన విభాగ కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యక్షులుగా సయ్యద్ జబీర్(గురజాల), దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి (మాచర్ల), ప్రధాన కార్యదర్శులుగా శివరాత్రి అశోక్‌కుమార్ (నరసరావుపేట), భిమాని అంకారావు (వినుకొండ), ఇల్లూరి వెంకటరామి రెడ్డి (గురజాల), నిమ్మా రాము (పెదకూరపాడు), యాసరపు బాబు (సత్తెనపల్లి), కార్యదర్శులుగా కోట చినబాబు (నరసరావుపేట), మాచర్ల పవన్‌కుమార్ (మాచర్ల), గోపు ఆంతోని రెడ్డి (పెదకూరపాడు), గాదె సత్యనారాయణ రెడ్డి (వినుకొండ), దాట్ల విక్రమ నరసింహ వర్మ (చిలకలూరిపేట), కంఠమనేని రామచంద్ర రావు (సత్తెనపల్లి), బైరెడ్డి బసవి రెడ్డి (మాచర్ల) నియమితులయ్యారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా నూలే అంకిరెడ్డి, అత్తర్ నాగూర్ వలి, షేక్ ఖాదర్ బాషా (వినుకొండ), బత్తుల సంజీవ రావు, పి.చిన్నరాజా (మాచర్ల), వజ్రాల శ్రీనివాస రెడ్డి, మైనేని ప్రతాపకుమార్, షేక్ బాజి (పెదకూరపాడు), ఎం.జయప్రకాష్ రెడ్డి, ఐ.దేశిబాబు (సత్తెనపల్లి), ఎం.డి.ఉస్మాన్, డి.జోజి బాబు, లకావత్ చిన దుర్గానాయక్, కత్తి రత్నశేఖర్ (చిలకలూరిపేట), షేక్ సైదా, పాతర్ల చిన్ని (నరసరావుపేట), చల్లా రంగారెడ్డి (గురజాల) నియమితులయ్యారు.