
వాహన రాకపోకలకు అంతరాయం
వెల్దుర్తి : పల్నాడు జిల్లాలోని దావుపల్లి వద్ద నేషనల్ హైవే 565పై కల్వర్టును ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్లు గుంత తవ్వడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షానికి వరద నీరు గుంతలో ప్రవహిస్తుండటంతో మార్కాపురం – మాచర్లకు వాహన రాకపోకలు శుక్రవారం నిలిచిపోయాయి. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికుల్లో కొందరు సర్వి బాదులు ఏర్పాటు చేసి వాగు దాటారు. రెండు గంటల తరువాత వాగు శాంతించడంతో ఊపిరి పీల్చు కున్నారు.
హైవేపై కల్వర్టు నిర్మాణానికి
తవ్విన గుంతతో అవస్థలు
నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

వాహన రాకపోకలకు అంతరాయం