
ఇక స్మార్ట్ షాక్
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
‘సర్వే’త్రా పచ్చపాతం !
సత్తెనపల్లి: విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్లను బలవంతంగా ప్రజల నెత్తిన పెట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు జరుగుతోంది. త్వరలోనే గృహ, వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది. సెల్‌ఫోన్ తరహాలో ముందుగానే రీచార్జి చేసుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. దీనిపై వినియోగదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఇలా...
జిల్లా వ్యాప్తంగా 7,77,718 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలవి 12,613, ప్రైవేట్ కనెక్షన్లు 7,65,105 ఉన్నాయి. ప్రస్తుతం 70,819 స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ సంస్థలకు 10,842 స్మార్ట్ మీటర్లు బిగించగా, ప్రైవేట్, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు 59,977 స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇక ఇళ్లకు, వ్యవసాయ బోరుబావులకు స్మార్ట్ మీటర్లు బిగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రభుత్వ సబ్సిడీపై విద్యుత్ వినియోగదారులకు, నామమాత్ర వినియోగదారులకు ఈ మీటర్లు బిగించరు.
రీచార్జి చేస్తేనే విద్యుత్...
సెల్‌ఫోన్, డిష్ టీవీ తరహాలో ముందస్తుగా స్మార్ట్ మీటర్‌కు రీచార్జి చేసుకోవాలి. రీచార్జ్ అమౌంట్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్తు ఎంత వినియోగించారు.. రీచార్జి ఎప్పటికీ పూర్తవుతుందన్న సమాచారం వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ విధానం ఇబ్బందులకు గురిచేయనుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లుల వసూళ్లు ఏపీ సీపీడీసీఎల్ అధికారులకు తలనొప్పిగా మారింది. ఆయా కార్యాలయాలు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. విద్యుత్ సంస్థకు భారీ నష్టాలు వస్తున్నాయి. అదే స్మార్ట్ మీటర్లు బిగిస్తే తప్పకుండా రీచార్జి చేసుకోవాలి. లేదంటే విద్యుత్ సరఫరా ఉండదు.
సత్తెనపల్లి శ్రీనివాస థియేటర్‌లో స్మార్ట్ మీటర్ బిగిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది (ఇన్‌సెట్‌లో) స్మార్ట్ మీటర్లు
న్యూస్‌రీల్
చంద్రబాబు, లోకేష్ తీరుపై విమర్శలు ...
మీటర్ భారం వినియోగదారుడు పైనే...
స్మార్ట్ మీటర్ ఖరీదును వినియోగదారుడే భరించాలి. సింగిల్ ఫేజ్ మీటర్ ఖరీదు రూ. 8,927. త్రీఫేజ్ మీటర్ రూ.17,286. ఈ మొత్తాన్ని 93 నెలల పాటు ఇన్‌స్టాల్‌మెంట్లుగా బిల్లుతో పాటు వసూలు చేస్తారు. స్మార్ట్ మీటర్‌ను రిమోట్ నుంచి ఆపరేట్ చేయవచ్చు. పీక్ సమయం పేరుతో అధిక చార్జి వసూలు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తం కానుంది. ఉదాహరణకు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు పీక్ సమయంగా నిర్ణయించారు. ఈ సమయం లో ఎక్కువ విద్యుత్ చార్జి వసూలు చేస్తారు. వేసవిలో ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది.
జిల్లాలో ఇప్పటి వరకు
70,819 స్మార్ట్ మీటర్ల
బిగింపు ప్రక్రియ పూర్తి
నాడు ప్రతిపక్షంలో ఉండగా వ్యవసాయ బోరుబావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక స్మార్ట్ షాక్