● సీఎం మోసాన్ని ప్రతి ఇంటికెళ్లి వివరించండి ● వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ముఖ్య నేతల పిలుపు ● జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం ● నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం ● అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచన ● కేసులకు భయపడొద్దని, అండగా ఉంటామని భరోసా
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి, ముఖ్యంగా మహిళలకు వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ముఖ్య నేతలు పేర్కొన్నారు. అన్నివర్గాలను చంద్రబాబు నిండా ముంచేశారని మండిపడ్డారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, పల్నాడు జిల్లా పరిశీలకులు డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. నాయకులకు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.సురేంద్ర, అచ్చి శివకోటి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం స్వామి, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, అంగన్ వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి హెల్డా ఫ్లోరెన్స్, గిరిజన, మాదిగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు పాలపర్తి వెంకటేశ్వరరావు, కందుల ఎజ్రా, రొంపిచర్ల మండల ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్ర, యువజన విభాగ నాయకుడు ఎన్‌కే ఆంజనేయులు కూడా మాట్లాడారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, పంచాయతీ విభాగ రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శనివారపు వాసుదేవరెడ్డి, అధికార స్పోక్ పర్సన్ ఆర్.శ్రీనివాసరావు, మద్దిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలను ముంచేసిన బాబు