
నీటిగుంటలో పడి వ్యక్తి మృతి
వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వతేదీన గ్రామ సమీపంలో బహిర్భూకని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో వున్న నీటి కుంటలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల వున్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.