
ఏపీ సార్వత్రిక ప్రవేశాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నరసరావుపేట: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్‌స్కూలు పదో తరగతి, ఇంటర్మీడియేట్ ప్రవేశాలకు చెందిన వాల్‌పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆవిష్కరించారు. దీనిలో డీఇఓ ఎల్.చంద్రకళ, డీఆర్‌ఓ మురళి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు గడువు పెంపు
డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం–2025 గాను అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపాదనలు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఈనెల 17, ప్రతిపాదనల తుది సమర్పణకు ఈనెల 20వ తేదీ వరకు గడువు పొడగించినట్టు వివరించారు. జిల్లాలోని డిప్యూటీ డిఈఓ, ఎంఈఓలు తమ పరిధిలోని ఉపాధ్యాయుల ప్రతిపాదనలను నిర్ణీతగడువులోగా http:// nationalawardsotŠreacherr .education.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని తెలిపారు.
‘వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్’కి సాయిరెడ్డి ఎంపిక
పెదకూరపాడు:మండలంలోని 75 త్యాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి కె.హెమంత్ సాయిరెడ్డి జాతీయ స్థాయిలో జరిగే అరుదైన ‘వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్’ కార్యక్రమానికి ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. హేమంత్ సాయిరెడ్డి హైదరాబాదులోని సీఎస్‌ఐఆర్ పరిశోధన సంస్థలో ఈ నెల 21న ‘వన్ డే యాజ్ ఎ సైంటిస్ట్’ గా పాల్గొంటాడు. శాస్త్రవేత్తలతో పని చేయడం, వారికి సహాయకుడిగా ఉండడం, ముఖాముఖీ, ప్రయోగాలు, ప్రయోగశాల పర్యటన, జీవ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవకణ పరిశోధన వంటి అంశాలపై ప్రయోగ అనుభవం పొందడమే కాకుండా ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో మమేకం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారాలనే ప్రేరణనిచ్చే అవకాశం అవుతుంది. పల్నాడు నుంచి కార్యక్రమానికి ఎంపికై న హేమంత్ సాయిరెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ, ఉప విద్యాశాఖ అధికారి ఏసుబాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. జియాలజిస్ట్ డాక్టర్ ఎస్.కె సాయిబాబు, ఉపాధ్యాయులు, పీసీ వైస్ చైర్‌పర్సన్ బి.చంద్ర కుమారి, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు సాయిరెడ్డిని అభినందించారు.

ఏపీ సార్వత్రిక ప్రవేశాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ