556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం

Jul 16 2025 3:35 AM | Updated on Jul 16 2025 3:35 AM

556.6

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 556.60 అడుగులకు చేరింది. ఇది 224.5548 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,650 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 64,789 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

‘స్థానిక’ పరిపాలనలో మహిళా భాగస్వామ్యం పెరగాలి

జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా

గుంటూరు ఎడ్యుకేషన్‌ : స్థానిక సంస్థల పరిపాలనలో మహిళా భాగస్వామ్యం పెరగాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ‘‘మహిళా నాయకత్వంలో మార్పు–స్థానిక స్వపరిపాలనలో సాధికారత’’ అనే అంశంపై మహిళా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్జీఎస్‌ఏ) వార్షిక ప్రణాళిక 2025–26లో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ మహిళా నాయకత్వంలో మార్పు ద్వారా స్థానిక పాలనలో స్వపరిపాలన సాధ్యపడుతుందని అన్నారు. గ్రామస్థాయిలో మహిళా ప్రజా ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సూచించారు.

అమృత భారత్‌ పనుల పరిశీలన

నరసరావుపేట: గుంటూరు–హుబ్లీ మార్గంలోని నరసరావుపేట, వినుకొండ, దొనకొండ రైల్వే స్టేషన్లను మంగళవారం డీఆర్‌ఎం సుథేష్ట సేన్‌ తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో అమృత భారత్‌ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎం.రమేష్‌కుమార్‌, డెప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎంఏ నోయల్‌, గుంటూరు సీనియర్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, గుంటూరు సీనియర్‌ డీసీఎం డాక్టర్‌ సీహెచ్‌.ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఈద్గా స్థలం కోసం క్షేత్రస్థాయి పరిశీలన

యడ్లపాడు: ఈద్గా స్థలం కేటాయింపునకు సంబంధించి ముస్లిం ప్రతినిధులు చేసిన వినతిని పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు, ఆర్డీవో మధులత కోట గ్రామాన్ని సందర్శించారు. మంగళవారం స్థానికంగా ఉన్న ప్రతిపాదిత భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈద్గా కోసం అభ్యర్థించిన స్థలం మొత్తం 51 సెంట్లు ఉంది. ఇది రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో, మూడు సర్వే నంబర్లలో విస్తరించి ఉందన్నారు. అందులో కొంత భాగం శ్మశానం, కాలువ, ఖాళీ భూమిగా ఉంది. స్థానికుల వినతిని దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తహసీల్దార్‌ జెట్టి విజయశ్రీ, సర్వేయర్‌ సురేంద్రనాథ్‌, ఆర్‌ఐ సుబ్బారావు, వీఆర్వో బాబురావు ఆమె వెంట ఉన్నారు.

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం 1
1/3

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం 2
2/3

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం 3
3/3

556.60 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement