
పల్టీ కొట్టిన టిప్పర్.. తప్పిన పెను ప్రమాదం
కారంచేడు: టిప్పర్ లారీ కొమ్మమూరు కాలువ అంచుకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పింది. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారి 167/ఏ కి గ్రావెల్‌ను తరలిస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఆదివారం బోల్తా కొట్టింది. కారంచేడు నుంచి కుంకలమర్రు వైపు వెళ్లే రహదారి కొమ్మమూరు కాలువ కట్టమీదగా ఉంటుంది. ఈ కట్టమీద ప్రయాణించే సమయంలో ఎదురుగా మరో వాహనం రావడంతో రోడ్డు మార్జిన్ దిగిన టిప్పర్ లారీ అప్పటికే వర్ష కురిసి ఉండటంతో మార్జిన్ నానిపోయి మెత్తగా తయారైంది. దీంతో టిప్పర్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన పొక్లెయిన్ ద్వారా వాహనాన్ని తీయించారు.