
రైతుకు కష్టం
అకాల వర్షం..
నాదెండ్ల: అకాల వర్షం రైతుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో నాదెండ్ల, గణపవరం, తూబాడు తదితర ప్రాంతాల్లో సుమారు అర్ధగంట సేపు వాన కురిసింది. కళ్లాల్లో ఆరబోసిన మిర్చిని రైతులు పట్టలు కప్పుకుని కాపాడుకున్నారు. పొగాకు ఆకులను రైతులు కట్టి పొలాల్లోనే ఆరబెట్టుకోగా వర్షానికి తడిచాయి. దీంతో నాణ్యత లోపిస్తుందని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు మాత్రమే కుట్టిన ఆకులై పట్టలు కప్పుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన మిర్చి తడిచింది. మార్కెట్లో మిర్చి పొగాకు ధరలు పతనం కావడంతో ఈ అకాల వర్షం మరింత నష్టపరుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
చిలకలూరిపేట టౌన్: చిలకలూరిపేటలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అప్పటివరకు ఎండగా ఉండగా, ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని, కొద్ది సేపట్లోనే చల్లని గాలులు వీస్తూ మోస్తరు వర్షం మొదలైంది. తర్వాత అది భారీవర్షంగా మారి గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షపు నీటితో పట్టణంలోని పలుచోట్ల కాలువలు నిండి మురుగునీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి హైవే పైకి కొంత నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గొట్టిపాడులో పిడుగుపాటు..
మండల పరిధిలోని గొట్టిపాడు గ్రామంలో వర్షం మధ్య పిడుగుపాటు కలకలం రేపింది. గ్రామంలో ఉన్న తాటిచెట్టు పై ఒక్కసారిగా పిడుగు పడింది. క్షణాల్లో మంటలు చెలరేగి తాడిచెట్టుతో పాటు చుట్టు ఉన్న చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

రైతుకు కష్టం

రైతుకు కష్టం

రైతుకు కష్టం